‘మహానాడు’కు భారీ బందోబస్తు కల్పిస్తున్నాం: విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్

  • రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు
  • ఇక్కడికి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నాం
  • ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నాం
విజయవాడలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు  ‘మహానాడు’ జరగనుంది. కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ‘మహానాడు’ జరగనున్న నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు.

‘మహానాడు’కు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్టు చెప్పారు. రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, వలంటీర్ల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు.
Go Back to Shorts
Andhra Pradesh
mahanadu
gowtham sawang

More Telugu News